తేలికపాటి విమానం కూలి ముగ్గురి మృతి

అమెరికా: అమెరికాలోని హూస్టన్‌ ప్రాంతంలోఉన్న హాబీ విమానాశ్రయంలో తేలికపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఓ హార్డ్‌వేర్‌ స్టోర్‌ వద్ద నిలిపివున్న కారుపైకి విమానం దూసుకెళ్లింది. విమానం పైనుంచి ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చి కుప్పకూలిపోయిందని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ అధికారులు తెలిపారు.