తొమ్మిదేళ్ల బాలుడి ఫెరారీ డ్రైవింగ్‌

తండ్రిపై పోలీసుల కేసు

కేరళ: తొమ్మిదేళ్ల కుమారుడి పుట్టినరోజు కానుకగా ఫెరారీ కారు తాళాలిచ్చారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయి తమ్ముడ్ని కూర్చోబెట్టుకుని మరీ ఉత్సాహంగా కారు నడిపేశాడు. దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టుకుని మురిసిపోయింది తల్లి , అది కాస్తా పోలీసుల కంటపడింది. మైనర్‌ బాలుడిచేత కారు నడిపించినందుకు, పిల్లల ప్రాణాలకు ప్రమాదం జరిగే పరిస్థితి కల్పించినందుకు తండ్రి అమల్‌ నిషాంపై కేసు నమోదు చేశారు. అయినా ఆ తల్లిదండ్రులు తమ చర్యను తప్పుగా భావించడం లేదు. పొగాకు, స్థిరాస్తి వ్యాపారి అయిన అమల్‌కి 18 కార్లున్నాయి. ఐదేళ్ల వయసునుంచే తమ కుమారుడు కారు నడుపుతున్నాడని, అతనిని చూసి తాము గర్విస్తున్నామని ఆ తల్లిదండ్రులు మురిపెంగా చెప్తున్నారు.