జనం సాక్షి ప్రతినిధి మెదక్ మెదక్పురస్కరించుకొని మెదక్పట్టణంలోని రామాలయంలో సీతారామచంద్రస్వామిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం మధుసూదనాచార్యులు శేరి దంపతుల చేత రాములవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శేరీ దంపతులకు స్థానిక కౌన్సిలర్ దుర్గాప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్ తదితరులు స్వాగతం పలికారు. పూజ కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్సీ శేరిని ఆలయ కమిటీ నాయకులు బండ నరేందర్ తదితరులు శాలువాతో సన్మానించారు. తర్వాత దేవస్థాన ఆవరణలో ఉన్న చిదంబర స్వామి ఆలయాన్ని కూడా ఎమ్మెల్సీ దర్శించుకుని హారతి నుంచి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ గారికి ఆలయ కమిటీ నాయకులు వివరించారు. రామాలయానికి నూతనంగా నిర్మిస్తున్న ద్వారానికి సంబంధించిన పనులను ఎమ్మెల్సీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ దుర్గాప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్, ఆలయ కమిటీ నాయకులు నగరం మల్లేశం, నందిని శ్రీనివాస్, రాము, సర్పంచులు మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్, మాజీ వైస్ ఎంపీపీ గోపాల రావు, మాజీ సర్పంచ్ గంగాపురం సిద్దిరాములు, కృష్ణశాస్త్రి, శుక్లా తదితరులు ఉన్నారు.
తొలి ఏకాదశి పర్వదినాన్ని




