గోపాల్ పేట్ జనం సాక్షి మార్చి (5): గోపాలపేట మండల పరిధిలోని బుద్దారం గ్రామానికి చెందిన తోళ్ల శ్రీహరి ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయినందున ప్రభుత్వం మత్యశాఖ ద్వారా 5 లక్షల రూపాయల ఎక్షగ్రేషియా చెక్కును మంజూరు చేసింది.అట్టి చెక్కును బుధవారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృతుని తండ్రి వెంకటయ్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్యశాఖ అధికారి ఎస్.ఎ.రెహమాన్,మండల అధ్యక్షుడు కోదండం,జడ్పీటీసీ మందా భార్గవి కోటీశ్వర్ రెడ్డి ,రైతు సమన్వయ అధ్యక్షుడు తిరుపతి యాదవ్,BRSV రాష్ట్ర నాయకులు యస్. శ్రావణ్ కుమార్,జిల్లా BRS నాయకులు బిళ్ళకంటి రాజు,మాజీ సర్పంచ్ వెంకటయ్య,మత్యశాఖ గ్రామ సంఘం అధ్యక్షుడు ఏషమోని శేఖర్,మద్దిలేటి,రవి మరియు మత్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.




