Tuesday, 3 November 2026

బండి సంజయ్ అరెస్టుకి రామారావు పాటిల్ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు.

..బండి సంజయ్ అరెస్టుకి రామారావు పాటిల్ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు…
– లీకేజీల ప్రభుత్వంపై నాయకుల మండిపాటు…
– రామారావు పటేల్,భాజపా నాయకుల హౌస్ అరెస్ట్…
బై0సా. రూరల్ ఏప్రిల్ 05. జనం సాక్షి
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బుధవారం బండి సంజయ్ అక్రమ అరెస్టు నిరసిస్తూ భాజపా తాలూకా నాయకులు రామారావు పటేల్ నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు…. బి. అర్.ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ నుండి ఎక్సమ్ పేపర్ల లీకేజీ వరకు అన్ని సవ్యంగా జరగకుండా దొంగబుద్ధి చూపుతున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోతున్నారని,రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎగ్జామ్ పేపర్ లీకేజ్ తో ముడి పెట్టడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. చేతగాని ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న రోజుల్లో భాజాపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇలాంటి లీకేజీ లేవీ ఉండవని అన్నారు. తాలుక నాయకులు రామారావు పటేల్ ని సైతం పోలీసులు హౌస్ అరెస్టు చేయగా, కార్యకర్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు పలువురు నాయకులను అరెస్టు చేశారు. ధర్నాలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, తూమోల్ల ముత్తన్న సేవా సమితి అధ్యక్షులు తూమోళ్ళ దత్తు , వడ్నప్ శీను,పలువురు భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.