Wednesday, 4 November 2026

తోషం చేరిన సేవాలాల్ దీక్షపరుల పాదయాత్ర

గుడిహత్నూర్: మార్చ్ 24( జనం సాక్షి)నార్నూర్ మండలం లోని కొత్తపల్లి దీక్షభూమి నుండి మహారాష్ట్ర లోని పౌరదేవి వరకు సేవాలాల్ దీక్షపరుల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండలంలో తోషం గ్రామానికి చేరుకుంది ఈ సందర్భంగా గ్రామస్థులు ఘానంగా స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంజారాల ఆధ్యాత్మిక దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెడు వ్యాసనాలకు దూరంగా ఉంటు ఆధ్యాత్మికను పెంపొందించుకోవాలని భక్తి మార్గంలో నడవలన్నారు తోషం తాండ గ్రామస్థులు సేవాలాల్ దీక్షదారులకు అన్నదానం ఏర్పాటుచేశారు కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ సభ్యుడు డాక్టర్ నరేష్ జాదవ్ పెంబి జడ్పిటిసి సభ్యురాలు భూత్యా జానకీ బాయి సేవాలాల్ దీక్షాపరులు బంజారా కుల పెద్దలు పాల్గొన్నారు