Wednesday, 4 November 2026

త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆందోళన

రెబ్బన: తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలోని భగత్‌సింగగ్‌నగర్‌లో మంచినీటి ట్యాంక్‌ ఎక్కి భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఇక్కడే కాకుండా మండలంలోని గంగాపూర్‌, కైకధాం, దుగ్గాపూర్‌ గ్రామాల్లోని మంచినీటి పథకాలకు మరమ్మతు చేపట్టి తాగునీటి సరఫరా చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *