భువనగిరి టౌన్ జనం సాక్షి:–కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాలలో నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తంగళ్ళపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని వివిధ గ్రామాలలో రాయిగిరి, తుక్కాపురం పెంచికలపాడు తదితర గ్రామాల రైతులతో త్రిబుల్ ఆర్ కింద రోడ్డు కింద భూములు కోల్పోతున్న రైతులను కలిసి బట్టి విక్రమార్క కు ప్రభుత్వం విడుదల చేసిన 600 పేజీల గల గజిట్ బుక్కుతో పాటు త్రిపుర రోడ్డు కు సంబంధించిన ప్రభుత్వం అందజేసిన నోటీసులతో సహా పోరాటాలకు సంబంధించిన మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క మాట్లాడుతూ తరతరాలుగా సేద్యం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న రైతు కుటుంబాలకు త్రిపుర రోడ్డు త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం ద్వారా రైతులకు తీరం నష్టం ఏర్పడుతుందని ప్రభుత్వం వెంటనే అలైన్మెంట్ మార్చాలని రైతుల పక్షాన అసెంబ్లీలో పోరాటాన్ని చేస్తామని రైతులతో అన్నారు. భూములు హక్కుల కోసం ఉద్యమ చరిత్ర కలిగిన ఈ ప్రాంత రైతులు అండగా ఉంటూ టిపిసిసి డెలిగేట్ మెంబర్ రైతు సంఘం త్రిబుల్ ఆర్ రైతు సంఘం నాయకుడు తంగళ్ళపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో నేటి వరకు నిర్వహించిన పోరాటాలను కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ప్రభుత్వము రైతుల పైన పెట్టిన కేసులను బెదిరకుండా పోరాటాలు నిర్వహించారని అన్నారు. ప్రభుత్వము ఒకే ప్రాంతం నుండి మూడు పర్యాయాలు అలైన్మెంట్లు మార్పులు చేసి ప్రభుత్వంలో ఉన్న పాలకులకు మేలు చేసి సామాన్య రైతులకు తీరని అన్యాయాన్ని చేస్తుందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




