చేగుంట జనంసాక్షి మే 72021-22 యాసంగి కి సంబంధించి పెండింగ్ ఉన్న 69,253 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ను రోజువారీ లక్ష్యం మేరకు మే నెలాఖరు వరకు డెలివరీ చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం తన ఛాంబర్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తో కలిసి కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ, ప్రస్తుత యాసంగి ధాన్యం దిగుమతిపై రైస్ మిల్లర్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత యాసంగికి సంబంధించి సి.ఏం.ఆర్. అందజేయుటకు ప్రభుత్వం మే నెలాఖరు నాటికి గడవు పెంచనుందని , రైస్ మిల్లర్లకు ఇదొక మంచి అవకాశమని అన్నారు. పౌర సరఫరాల శాఖకు పెండింగ్ ఉన్న 36,527 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించి రోజు వారి లక్ష్యం మేరకు బియ్యాన్ని గోదాములకు తరలించవలసినదిగా రా రైస్ మిల్లర్లకు సూచించారు. గోదాములలో ధాన్యం దించుకొనుటకు అవసరమైన హమాలీలను ఏర్పాటు చేయవలసినదిగా కాంట్రాక్టర్ రమేష్ ను ఆదేశించారు.అదేవిధంగా భారత ఆహార సంస్థకు పెండింగ్ ఉన్న 32,716 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించి రోజు వారి లక్ష్యం మేరకు సనత్ నగర్ లోని గోదాములకు బియ్యాన్ని తరలించవలసినదిగా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు డెలివరీ చేయని రైస్ మిల్లులు 125 శాతం పెనాల్టీ చెల్లించవలసి ఉంటుందని, అట్టి మిల్లులను డిఫాల్టర్ జాబితాలో ఉంచడం జరుగుతుందని రమేష్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.




