Tuesday, 3 November 2026

త్రిబుల్ ఆర్ బాధితుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తత అడ్డుకున్న నాయకులను అరెస్ట్ పోలీస్ స్టేషన్కు తరలింపు

భువనగిరి టౌన్( ప్రజా దేశం):–త్రిబుల్ ఆర్ బాధితుల రైతులు చేపట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనలు కార్యాలయం ముట్టడిలో తీవ్రత ఉద్రిక్తత చోటుచేసుకుంది.బాధిత రైతులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అలైన్మెంట్ మార్చాలని గత రెండు రోజుల నుండి 48 గంటల త్రిబుల్ ఆర్ బాధితుల దీక్షను చేపట్టారు.
ఈ దీక్షకు టిపిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ బిజెపి రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. ఇదే సమయంలో
మంగళవారం రాష్ట్రమంత్రి జగదీశ్వర్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తెలంగాణ దశాబ్ది ఉత్సాల ఏర్పాటులో భాగంగా కలెక్టరేట్ క్యాంప్ ఆఫీసులో సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న అన్నదాతలు రైతుల నాయకులు అన్నదాతలు కలెక్టరేట్లో చోచ్చుకుపోయి మంత్రికి తమ విన్నపాన్ని తెలిపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో మోహరించిన ఉన్న పోలీస్ బలగాలు ఒక్కసారిగా వారిని అడ్డుకున్నాయి . సమావేశం అనంతరం
మంత్రి పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధాన ద్వారా కాకుండా రైతులను కలవకుండా కార్యాలయం వెనుక వైపు ఉన్న వెనుక భాగంలో ఉన్న మరో మార్గం ద్వారా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. రైతులు అడ్డుకోవడానికి పోగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అయినప్పటికీ భారీ స్థాయిలో అన్నదాతలు ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నాయి. పరిస్థితి ఉద్ధృతకంగామారడంతో రైతు నాయకులతోపాటు పలువురు నాయకులు టిపిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ బిజెపి రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి లను అన్నదాతలను అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాలకు ఎక్కించి వారిని తుర్కపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి రవికుమార్, గూడూరు నారాయణరెడ్డి లు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి రైతుల భూములను పరిరక్షణ కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు చిన్నపిల్లలతో సహా గత సంవత్సరం నుండి భూములపై ఆధారపడి సన్నకారు రైతులు జీవిస్తున్న కుటుంబాలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి పట్టింపులేదని ఆరోపించారు. రైతులు భూములు కోల్పోతున్నామని కన్నీరు మున్నీరైతుంటే మంత్రిగాని ఎమ్మెల్యే గాని కనీసం రైతుల వినతి పత్రము తీసుకోకుండా రైతులను చేస్తున్న దీక్షలో పరామర్శించకుండా దశాబ్ది ఉత్సాల పేరిట సమావేశాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల భూములను వారికి నచ్చిన విధంగా అలైన్మెంట్లను మార్పులు చేస్తూ రైతుల జీవన ఆధారాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తో రైతులకు అపాయింట్మెంట్ ఇప్పించాలని రైతుల భూములను కాపాడాలని, లేనియెడల గ్రామాలలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బటురామ్ చంద్రయ్య నక్కల ఆదినారాయణ కుక్క దు సోమయ్య పాండు కర్ణాకర్ సుధాకర్ పల్లెల యాదగిరి రత్నపురం బలరాం సత్యనారాయణ కైరం కొండ వెంకటేష్ వడ్చర్ల కృష్ణ యాదవ్ బద్ద బాల్రెడ్డి చల్లగురువుల రఘుబాబు కూర వెంకటేష్ ఎల్లమ్మ శ్యామల రవీందర్ లక్ష్మీ యాదమ్మ పుష్ప రాణి కవిత రైతులు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు..