హుజూరాబాద్, మే 30 (జనంసాక్షి) :హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్, జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవీ ఆదేశాల మేరకు నిర్వహించిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం అయినట్లు డిప్యూటీ డిఎంహెచ్ వో డాక్టర్ చందు తెలిపారు. ఈ కంటి వెలుగు శిబిరంలో సుమారు 200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు, దాదాపు 60 మందికి దగ్గర చూపు అద్దాలు పంపిణి చేసినట్లు ఆయన తెలిపారు. 20 మందికి పి సెప్షన్ గ్లాసెస్‌కు సిఫారసు చేశామని ఆయన తెలిపారు. ఆర్టీసీ డీపో మేనేజర్ పి. అర్పిత, కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, వివిధ శాఖల సిబ్బంది, ప్రభుత్వాస్పత్రి సిబ్బంది కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిబిరంలో వైద్యాధికారిణి డాక్టర్ ప్రత్యూష, ఏఎన్ఎం వనిత, ఆప్తాలని ఆఫీసర్స్ రఘోతం రెడ్డి, జలంధర్, జిల్లా హెల్త్ ఎడ్యూకేటర్ పంజాల ప్రతాప్, హెల్త్ ఎక్సన్షన్ ఆఫీసర్ చీకట్ల రమేష్, హెల్త్ ఎడ్యూకేటర్ రవీందర్, అశోక్, రేష్మా, సబ్ యూనిట్ ఆఫీసర్ మల్లయ్య, ఎల్ డి కంప్యూటర్ భవానీ, టాటా ఎంట్రీ ఆపరేటర్స్ వేణు, సంపత్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగు వైద్య శిబిరం విజయవంతం




