భువనగిరి టౌన్ (జనం సాక్షి):–త్రిబుల్ ఆర్ రోడ్ భూనిర్వాసితులతో నిర్వహించవలసిన ఇయరింగుకు అధికారులు సమయం ఇచ్చి గైర్హాజర్ కావడంతో రైతులు ఆగ్రహించి స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట వినూతనంగా మోకాళ్లపై నిరసన తెలియజేశారు.రాయి గిరి రైతుల భూముల నుండి ఇప్పటికే హై టెన్షన్ విద్యుత్ లైను, కాలేశ్వరం ప్రాజెక్టు, బైపాస్ రోడ్డు నిర్మాణాలకు రైతులు భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయి ఉన్నారు.
ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్రిబుల్ ఆర్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో తిరిగి అదే గ్రామము నుండి రోడ్డు నిర్మాణానికి భూములు సేకరించడంతో రైతులు గత ఆరు నెలల నుండి ధర్నాలు నిరసనలు చేపట్టిన విషయం విధితమే. రైతుల భూములపై మూడు పర్యాయాలు సర్వే నిర్వహించారు. నేషనల్ అథారిటీ అధికారులు ఇటీవల రైతులతో నివృత్తి కోసం సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జనవరి 27న తేదీని ఖరారు చేసి రైతులకు వివరించారు. అధికారులు చెప్పిన విధంగా రైతులు ఆర్డీవో కార్యాలయానికి విచ్చేసి నా అధికారులు ఎవరూ రాకపోవడంతో ఆగ్రహించి రైతులు మోకాళ్లపై నేలపై కూర్చొని నిరసన తెలియజేశారు. రైతుల భూములు కాపాడాలని ఆడియో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తంగళ్ళపల్లి రవికుమార్, పాండు, నాయిని పూర్ణచందర్, అర్జున్ రెడ్డి, సంజీవరెడ్డి, అవుశెట్టి పాండుయాదవ్, పసుపునూరి నాగభూషణం, నరసింహారెడ్డి, వీరయ్య, మల్లయ్య, ఐలయ్య, ఆంజనేయులు, స్వామి, సురేష్, కౌసల్య, పోచమ్మ, లక్ష్మి రైతులు తదితరులు పాల్గొన్నారు.




