Wednesday, 4 November 2026

త్వరలోనే 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానుంది అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.

అలంపూర్ జూన్ 14 (జనంసాక్షి ) నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అలంపూర్ చౌరస్తా లో నిర్మాణం చేసిన వందపడకల ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి రానుందని ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా
అలంపూర్ చౌరస్తా లోని మార్కెట్ యార్డ్ లో బుధవారం వైద్య, ఆరోగ్య దినోత్సవ వేడుకలు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం హాజరైయ్యారు. ఈసందర్బంగా ఉతమ్మ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలను, కొత్తగా ఎం ల్ హెచ్ పి వారికి జాయినింగ్ ఆర్డర్ కాపీలను, మరియు ఏ ఎన్ ఎం,ఆశ వర్కర్లకు దుస్తులను మరియు కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య మహిళా” గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన, వైద్యారోగ్య రంగం సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది అన్నారు . సీఎం కేసీఆర్ కృషితో మనకు 100 పడకల ఆసుపత్రి మంజూరు అయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది, అలాగే హైదరాబాదు నగరం లో నిమ్స్ 2 వేల పడకల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ గ భూమి పూజ చేయడం జరిగింది అన్నారు.చుట్టూ 4 వేల 200 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణములు జిల్లా కు ఒక మెడికల్ కాలేజ్ మంజూరు, ఒకవైపు వైద్య విద్య మరో వైపు నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నది అన్నారు.ప్రజలకు ఆరోగ్యభాగ్యాన్ని అందించడంలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా వైద్య రంగాన్ని పటిష్టం చేస్తుంది అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం వినూత్న పథకాలతో అన్ని ప్రాంతాలలో వైద్య సదుపాయాలు మెరుగుపరిచి వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణాను విప్లవాత్మకమైన దిశలో ముందుకు నడిపించడం సీఎం కేసీఆర్ కే సాధ్యం అవుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి జెడ్పీటీసీ కాషాపోగు రాజు , అలంపూర్ మునిసిపల్ చైర్ పర్సన్ మనోరమ ,ఎంపీపీ రజితమ్మ ,ఎంపీటీసీ ఉమేష్ గౌడ్ ,లత రవి రెడ్డీ , జిల్లా ఉపవైద్యాధికారి సిదప్పా,డాక్టర్ ఇర్షద్ ,ప్రసున్న రాణీ , టీటీ దొడ్డి శివ కుమార్ , మరియు ఏ యన్ ఎం మహేశ్వరీ, జానమ్మ, మద్దమ్మ, శకుంతల ఆశ కార్యకర్తలు పెద్దదిన్నె సరస్వతి, కళావతి తో పాటు నియోజకవర్గం లో ఆశలు,వైద్య శాఖ అధికారులు మరియు పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.