వరంగల్ బ్యూరో, జూన్ 14 (జనం సాక్షి)జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం బుధవారం ప్రెస్ క్లబ్ లో అన్ని యూనియన్ల నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కింది తీర్మానాలు చేయడం జరిగింది.1.ఈ సమావేశానికి ఏకశిలా, కాకతీయ హౌసింగ్ సొసైటీలను ఆహ్వానించినప్పటికీ సమావేశానికి హాజరుకాలేమని వారు లేఖల ద్వారా తెలియజేయడం జరిగింది. 2.ఆ రెండు సొసైటీల నేతలతో యూనియన్ నేతలు మాట్లాడాలని నిర్ణయించడం జరిగింది. 3.అన్ని యూనియన్లతో కలిసి నివేశనా స్థలాల సాధించటం కోసం ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ రూపొందించడం. 4.ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టుల నివేషణ స్థలాల కోసం జాబితాను రూపొందించడం.
5.ఈ నెల 17న వరంగల్ లో జరిగే మంత్రి కేటీఆర్ సమావేశంలో నివేషణ స్థలాల కోసం నిలదీయడం,
6.ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు అన్ని యూనియన్ల అధ్యక్ష కార్యదర్శుల తో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి కార్యచరణ రూపొందించుకుని ముందుకు సాగడం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం ఎప్పుడు సమావేశం ఏర్పాటుచేసినా హజరవుతామని అన్ని యూనియన్ల నేతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో టి యు డబ్ల్యూ ఐ జే యు హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డం రాజి రెడ్డి, తోట సుధాకర్, వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామచందర్, మట్ట దుర్గాప్రసాద్, టి యు డబ్ల్యూ జే(143) హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మస్కపురి సుధాకర్, నాయకపు సుభాష్. వరంగల్ జిల్లా అధ్యక్షుడు మెండు రవీందర్, కార్యదర్శి ఉమేందర్, టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, జిల్లా అధ్యక్షులు టీవీ రాజు, టీఏజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూటెంకి ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆర్ వి ప్రసాద్, ప్రెస్ క్లబ్ కోశాధికారి అమర్ లు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై అన్ని యూనియన్ నేతలతో సమావేశం




