Wednesday, 4 November 2026

త్వరలో టీఎస్ వ్యాలెట్‌ను ప్రజల్లోకి తీసుకొస్తాం

kcrహైదరాబాద్ : నోట్ల రద్దుపై శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇది వరకే ఆర్బీఐకి రెండు లేఖలు రాశామని గుర్తు చేశారు. రైతులు, దినసరి కూలీలు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని తెలిపారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. త్వరలో టీఎస్ వ్యాలెట్‌ను ప్రజల్లోకి తీసుకొస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామం వందశాతం నగదు రహిత గ్రామంగా మారిందన్నారు. సిద్ధిపేట నియోజకవర్గాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి జిల్లాల్లోని కొన్ని గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై విధానపరమైన నిర్ణయాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రాష్ర్టంలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *