మెట్రో రైల్ నిర్మాణం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. ఆటంకాలు తొలగిపోతున్నాయని.. వచ్చే ఏడాది సేవలను ప్రారంభించనున్నట్లు
వెల్లడించారు. నాగోలు-మెట్టుగూడ మధ్య 4 కిలోమీటర్ల మార్గం, మియాపూర్-ఎస్సార్‌నగర్ మధ్య 12 కిలోమీటర్ల మార్గం వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. 2017 ఉగాది రోజున లేదా.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. మిగిలిన మార్గాన్ని సైతం వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు పనులు సాగుతున్నాయని తెలిపారు. ఒప్పందం ప్రకారం 2017 జులై నాటికి పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు.
త్వరలో మెట్రో..!




