యాదాద్రికి లక్షమంది భక్తులు ఒకేరోజు వచ్చినా సాఫీగా దర్శనం జరిగేలా, అందరికీ వసతి సౌకర్యాలు లభించేలా ఏర్పాట్లు చేపట్టాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. తితిదే ఏర్పాటు చేసిన తరహాలోనే యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటిడిఏ) ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. యాదాద్రికి ఇటీవలకాలంలో భక్తుల సంఖ్య బాగా పెరిగిందని, సెలవు రోజుల్లో, ప్రత్యేక సందర్భాల్లో లక్ష మందికిపైగా భక్తులు వస్తున్నారన్నారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సాఫీగా దర్శనం, అందరికీ మంచి వసతి లభించేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా యాదాద్రికి నాలుగు వైపుల నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
యాదాద్రికి వసతి సౌకర్యాలు




