ఎల్కతుర్తి జూన్ 7 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీకి వెళ్లిన కట్కూరి మొగిలి 55 వడగలుపులకు తట్టుకోలేక ఎండవేడికి అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి ప్రభుత్వం వారు స్పందించి తగు సహాయం చేయా లని గ్రామస్తులు కోరారుఅలాగే ఉపాధి హామీ కూలీల కొరకు గుడారాలు ఏర్పాటు చేసి తాగునీటి కోసం మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు తుంగలో తొక్కారు అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా అరికట్టవచ్చని గ్రామస్తులు కోరారు ఇప్పటికైనా స్పందించి అధికారులు ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీల కొరకు గుడరాలు తాగునీటి ఏర్పాటు చేయాలని పని లలో టైము కూడా మార్చి 9 గంటల వరకే ఇంటికి పంపించే విధంగా ఉండాలని గ్రామస్తులు కోరారు
దండేపల్లి లో వడదెబ్బకు ఎలుకతుర్తి ఉపాధి కూలి మృతి




