Wednesday, 4 November 2026

దంతాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య యాదవ్ డిసిసి ప్రధాన కార్యదర్శి ఈ వెంకటేశం

మోమిన్ పేట జూన్ 13 జనం సాక్షిప్రతి ఒక్కరు తమ దంతాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య యాదవ్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈ వెంకటేశం లు పేర్కొన్నారు మంగళవారం మండల పరిధిలోని మురంగపల్లి గ్రామంలో సాయి డెంటల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం దంతాలను శుభ్రం చేసుకుంటే ప్రజలు రోగాల బారిన పడకుండా ఆరోగ్యకరంగా ఉంటారని వారు అన్నారు కొంతమంది గుట్కాలు సిగరెట్లు కాల్చి దంతాలను పాడు చేసుకుంటున్నారని వీటికి దూరంగా ఉండి దంతాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు చిన్నోడు మొదలుకొని వృద్ధుల వరకు దంత రక్షణ చేసుకుంటే జీవితాంతం ఆరోగ్యకరంగా దంతాలు గట్టిగా ఉంటాయన్నారు సర్వరోగ నివారిణి దంతాల వల్లనే ఉపయోగం గా ఉంటుందన్నారు ఈ వైద్య శిబిరంలో 200 మంది ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుకుని మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మొహమ్మద్ వాయిస్ డాక్టర్ లీలా లలిత డాక్టర్ సాయి కుమారి డాక్టర్ దీదీ ప్రియా డాక్టర్ శ్రీదేవి డాక్టర్ జగదీశ్ రెడ్డి డాక్టర్ శ్రీకర్ పిఆర్ఓ రవీందర్ గౌడ్ గ్రామస్తులు అంజిరెడ్డి నరసింహారెడ్డి మాణిక్ రెడ్డి మొహమ్మద్ ఖాసిం వంటికూర వెంకట్రెడ్డి నర్సింలు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు