Wednesday, 4 November 2026

బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలి

బెల్లంపల్లి, జూన్ 13, (జనంసాక్షి )బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ స్థానికులకే ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. స్థానికులకు ఎవ్వరికి టికెట్ ఇచ్చిన అందరం కలిసికట్టుగా పనిచేసి బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తామని చెప్పారు. స్థానికులకు టికెట్ ఇవ్వడం వల్ల ప్రజా సమస్యలు అనునిత్యం తెలుసుకొని ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలను తీర్చడం వల్ల పార్టీకి కూడా మంచిపేరు వస్తుందన్నారు. విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రెటరీ ఎండీ అనీఫ్, మైనార్టీ సీనియర్ నాయకులుఎండీ గౌస్, సలీమ్, 13వ వార్డు ఇంచార్జ్ ఖాజా మొయినుద్దీన్, 4వార్డు ఇంచార్జ్ ఖలీల్ పాల్గొన్నారు.