Thursday, 5 November 2026

దక్షిణ కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మృతి, 42 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌: దక్షిణ కొరియాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8మంది పరిస్థితి విషమంగా ఉంది. దక్షిణకొరియాలోని ఇంచియాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని వంతెనపై ఈ ఉదయం దాదాపు 100 వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *