Wednesday, 4 November 2026

దగ్గరకు వస్తే కత్తితో పొడుచుకుంట!

మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగ హల్ చల్ చేశాడు. మహబూబ్ పాషా పై పలు నేరాల కింద పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులకు.. పాషా తన ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పాషాను పట్టుకునేందుకు పోలీసులు మూకుమ్మడిగా అతడి ఇంటిని చుట్టుముట్టాయి. అయితే పోలీసులను చూసిన పాషా తనను పట్టుకునేందుకు దగ్గరకు వస్తే.. కత్తితో పొడుచుకుంటానని బెదిరించాడు. దీంతో ఏంచేయాలో అర్థం కాక పోలీసులు ఇంటిచుట్టు ఉండిపోయారు. దాదాపు 9గంటలపాటు పాషా ఇంటి ముందు పోలీసులు కాపలా కాయాల్సి వచ్చింది. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *