Wednesday, 4 November 2026

దగ్గుమందు పేరుతో డ్రగ్స్…

హైదరాబాద్: దగ్గుమందు ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలపై అబాట్ కంపెనీ యజమాని అరీబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న అబాట్ కంపెనీలో మత్తుమందులతో పెన్సిడిల్ దగ్గుమందులను తయారు చేస్తున్నట్లు తెలిసింది. రూ. 57 కోట్ల విలువైన మందులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని అబాట్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తామని డీజీ అకున్‌ సబర్వాల్‌ చెప్పారు. ఈ కేసులో కంపెనీ యజమాని అరీబ్‌ను విచారిస్తున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *