మాజీభర్త గుప్తా సంచలన ప్రకటన
న్యూఢిల్లీ,ఆగస్ట్29(జనంసాక్షి): డేరా బాబా అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తనను నమ్మిన భక్తురాళ్లనే కాదు.. దత్తత తీసుకున్న కూతురినీ గుర్మీత్ వదల్లేదని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని గుర్మీత్ దత్త పుత్రిక అయిన హనీప్రీత్ ఇన్సాన్ భర్త విశ్వాస్ గుప్తానే బయటపెట్టారు. తన భార్యతో గుర్మీత్‌కు శారీరక సంబంధం ఉందని అతను చెప్పాడు. హనీప్రీత్ అసలు పేరు ప్రియాంకా తనేజా. ఆమెను 1999లో గుర్మీత్ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు విశ్వాస్ గుప్తా. 2011లో విడాకుల కోసం అతను దరఖాస్తు చేసుకున్నాడు. అందులోనే ఈ విషయాన్ని అతను వెల్లడించాడు. బాబా ప్రైవేట్ రూమ్‌లోకి ఓ సారి తాను వెళ్లగా తన భార్య అక్కడే ఉంది. వాళ్లు అనుకోకుండా డోర్ తెరిచే ఉంచారు. ఇద్దరూ పూర్తి నగ్నంగా ఉన్నారు. నన్ను చూసి వాళ్లు షాక్ తిన్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనీ, చెబితే చంపేస్తానని బాబా నన్ను బెదిరించాడు అని మెయిల్ టుడేతో విశ్వాస్ గుప్తా చెప్పాడు. బాబా ఎక్కడికెళ్లినా తనను, తన భార్య హనీప్రీత్‌ను వెంట తీసుకెళ్లేవాడని అతను తెలిపాడు. అయితే ప్రతిసారి తన భార్య, బాబా ఒక గదిలో నిద్రించేవాళ్లని, తాను వేరే గదిలో ఉండేవాడినని విశ్వాస్ వెల్లడించాడు. అయితే ఈ ఆరోపణలను డేరా సచ్చా సౌదా అనుచరులు మాత్రం ఖండించారు. ఆ తర్వాత ఈ ఆరోపణలను వెనక్కి తీసుకున్న గుప్తా.. కోర్టు బయటే విడాకుల అంశాన్ని పరిష్కరించుకున్నాడు. అప్పటి నుంచి డేరా అనుచరుల బెదిరింపులతో విశ్వాస్.. అజ్ఞాతంలో బతుకుతున్నాడు. తన భార్య అందంగా ఉంటుందని, దురుద్దేశం ఉంది కాబట్టే గుర్మీత్ ఆమెను దత్తత తీసుకున్నాడు అని కూడా విశ్వాస్ చెప్పాడు. ప్రస్తుతం హనీప్రీత్ డేరాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. గుర్మీత్ తర్వాతి స్థానం ఆమెదేనని
అంటున్నారు.




