దర్గా ఉత్సవాలకు 11వేల విరాళం..
ఊరుకొండ, డిసెంబర్ 8 (జనంసాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేట గ్రామంలో ఈనెల 11 నుండి 13వ తేదివరకు మూడు రోజులపాటు నిర్వహించబోయే హజ్రత్ అమీనొద్దిన్ వలియ దర్గా ఉత్సావాలను పురస్కరించుకుని గురువారం గ్రామ సర్పంచ్ దండోత్కర్ అనితనాగోజి తమ వంతు సహయంగా రూ.11,116 నగదును దర్గా కమిటీ సబ్యులకు విరాళంగా అందజేశారు. దర్గా ఉత్సవాలకు సహకరించినందుకు కమిటీ సభ్యుల తరుపున సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జహీర్, జహంగీర్, ఖదీర్, అన్వర్ పాషా, ఆరిఫ్, జహంగీర్, సాదిక్ తథదిరులు ఉన్నారు.
దర్గా ఉత్సవాలకు 11వేల విరాళం




