దళితులను అన్ని విధాలుగా మోసం చేసిన కేసీఆర్ రాబోయే రోజుల్లో కెసిఆర్ కు సరి అయిన గుణపాఠం చెబుతారు బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు యశ్వంత్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 14 ::దళితులను అన్ని విధాలుగా మోసం చేసిన కేసీఆర్ కురాబోయే రోజుల్లో దళితులు సరి అయిన గుణపాఠం చెబుతార నీ బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు యశ్వంత్ అన్నారు.భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా sc మోర్చా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు అధ్యక్షుడు అశ్వంత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓల్డ్ బస్టాండ్ లోని బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా అశ్వంత్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులని సీఎం చేస్తా అంటూ మోసం చేశారని గుర్తు చేశారు. తరువాత మూడెకరాల పొలం ఇస్తా అంటూ రెండోసారి డబుల్ బెడ్ రూమ్ మరియు దళిత బంధు ఇస్తానని ఇలా అవకాశం దొరికిన ప్రతిసారి దళితులను అన్యాయం చేయడం జరిగింది ఆయన మండిపడ్డారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే తప్పుడు మాటలని ఎవరు నమ్మరని అంటూ ధ్వజమెత్తారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎస్సీ మోర్చా నాయకులు గోపాల్, బిచ్చప్ప, కౌన్సిలర్ నాయి కోటి రమేష్ పట్టణ అధ్యక్షుడు రవిశంకర్, బీజేవైఎం అధ్యక్షుడు వినోద్, శ్రీకాంత్, కిరణ్, ఆదిత్య, బుజ్జప్ప, పిడి సందీప్, తదితరులు పాల్గొన్నారు.