ధూప దీప నైవేద్యంతో అర్చకులకు ఉపాధి- టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి  , జూలై 14  :

ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలమై పోతున్న పూర్వ వైభవం కల్పించేందుకు సీఎం కెసిఆర్ నిధులు కేటాయించడంతో అర్చకులకు ఉపాధి కలిగిందనీ టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.

సంగారెడ్డి పట్టణంలోని చింత ప్రభాకర్  క్యాంపు కార్యాలయంలో  శుక్రవారం అర్చకులు మర్యాదపూర్వకం కలిసి చింతా ప్రభాకర్ను  సన్మానించారు.

ధూప దీప నైవేద్యం చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు అర్చకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ

దూప దీప నైవేద్యం కింద కెసిఆర్  రూ.10 వేలు మంజూరు చేసినట్లు వివరించారు

నియోజకవర్గంలో మొత్తం 32 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం కింద అందుతున్నాయి అన్నారు.

బతుకుదెరువు కోల్పోతున్న బ్రాహ్మణులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఉపాధి దొరికింది అన్నారు.

తదనంతరం అర్చకులు వేదమంత్రాలతో చింతా ప్రభాకర్ గారిని ఆశీర్వదించారు.

తాజావార్తలు