Thursday, 5 November 2026

దళితులు అన్ని రంగాల్లో రాణించాలి:సీఎం కేసీఆర్

cm kcr in trade expo

హైదరాబాద్: దళితులు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఇవాళ దళిత పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఎక్స్‌పో సదస్సుకు ఆయన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎక్స్‌పోలో స్టాల్స్‌ను చూస్తుంటే దళితులు శక్తి సామర్థ్యాలు అర్థమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం దళిత పారిశ్రామిక వేత్తలకు రూ.5 కోట్ల మార్జిన్ మనీ ఇస్తుందని స్పష్టం చేశారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్న సీఎం ప్రభుత్వం దళిత పారిశ్రామిక వేత్తలకు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని హామీనిచ్చారు.

దళిత పారిశ్రామిక వేత్తలు ఉపాధి కోరే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. ఏ పారిశ్రామికవేత్తా..కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి అప్లికేషన్ అయినా తెలంగాణ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. పది, పదకొండు రోజుల్లో పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులు మంజూరవుతాయని సీఎం స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *