దళిత బంధును అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదు..!
జనంసాక్షి , మంథని : దళిత బంధును అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని దళిత బంధు లబ్ధిదారులు ఆరోపించారు. స్థానిక అంబేద్కర్ రస్తాలో దళిత బంధు లబ్ధిదారులు శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంథని నియోజకవర్గంలో దళిత బంధు ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. దళిత బంధు లబ్ధిదారుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఉన్నారన్నారు. అయినప్పటికీ దళిత బంధును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమందరం దళిత బంధుకు అర్హులమేనని మరోసారి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తగిన గుణపాఠం చెపుతామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు బడికెల సతీష్, కాశిపేట సమ్మయ్య, చంద్రశేఖర్, వెల్పుల శ్రావణ్, వెంకటేష్, పీక మల్లయ్య, చెన్నూరి అశోక్, బూడిద వెంకటయ్య, బూడిద సమ్మయ్య, నారపల్లి సమ్మయ్య, మంథని రాజపోచం, మంథని కిష్టయ్య, మంథని సుధాకర్, రవి, సురేష్‌లు పాల్గొన్నారు.