Saturday, 7 November 2026

దళిత బంధు, అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో బాలరాజు

దళిత బంధు, అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో బాలరాజు

టేకులపల్లి, డిసెంబర్ 22 (జనం సాక్షి ): మండలంలో ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు ఆధ్వర్యంలో గురువారం విస్తృతంగా పర్యటించి దళిత బంధు మంజూరైన యూనిట్లను, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మండలం లోని రాంపురం గ్రామపంచాయతీలో దళిత బంధు పథకం కింద మంజూరి అయిన మినీ డైరీ యూనిట్లను, పశువులు( గేదెలు ), గొర్రెల పెంపకం యూనిట్లను తావుర్యా తండా, గ్రామ పంచాయతీలో జరుగుతున్న తెలంగాణ క్రీడా ప్రాంగణం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ పశువులను, గొర్రెలను పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పశువైద్య వైద్యులను, సిబ్బందిని తరచూ సంప్రదించి వాటికి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మాణాలు, క్రీడా ప్రాంగణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ వి.సంతోష్ కుమార్, రాంపురం గ్రామ సర్పంచ్ ఇందిర , ఏపీఓ కాలంగి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శలు సందీప్, అజయ్ కుమార్ లు పాల్గొన్నారు.