Saturday, 7 November 2026

గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే,

గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్
కొండమల్లేపల్లి డిసెంబర్ 22 జనంసాక్షి న్యూస్ :
కొండమల్లెపల్లి మండల కేంద్రంలో గురువారం నాడు గన్యానాయక్ తండాలో రూ.16లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని దేవరకొండ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.గ్రామాలను అని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఆయన గుర్తు చేశారు.గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.తమ తండాలను,తమ గూడలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్,బిఆర్ఎస్ జిల్లా నాయకులు అబ్బానబోయిన శ్రీనివాస్ యాదవ్, స్థానిక సర్పంచ్ రమావత్ రాములు నాయక్, మాజీ సర్పంచులు రమావత్ లాలు నాయక్,రమావత్ శ్రీను,రావుల వెంకటయ్య,రమావత్ తూలిసిరామ్,రమావత్ బీమ్ సింగ్,బోడ్డుపల్లి కృష్ణ,భద్రు నాయక్,ముడావత్ పాండు, వెంకటేష్, విరస్వామి,జాగృ,ఎంపీడీఓ బాలురాజ్ రెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.