Tuesday, 3 November 2026

దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా జరపాలి.

 

 

 

 

జనం సాక్షి దుబ్బాకరాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుసిద్ధిపేట 31 మే 2023:తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సిద్ధిపేట నియోజకవర్గంలో వైభవంగా నిర్వహిద్దాం. సిద్ధిపేటలో జరిగే వేడుకలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.

దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, అన్నీ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు.

స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని చాటేలా వేడుకలను సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రతి పల్లె, పట్టణాల్లో పండుగ వాతావరణంలో జరపాలని మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.

– దశాబ్ద కాలంలో శతాబ్ధి అభివృద్ధి సాధించాం. నాడు ఉద్యమంలో ముందున్నాం. నేడు అభివృద్ధిలో ముందున్నాం. ఇవాళ అభివృద్ధికి సిద్ధిపేట అధ్యయన కేంద్రంగా మారింది.

– ఇతరులకు గొప్ప మార్గదర్శనంగా నిలిచాం. ఇదంతా జరిగిదంటే దీని వెనుక తీవ్రమైన ప్రయత్నం ఉంది. సిద్ధిపేట నియోజకవర్గం ప్రగతిలో అగ్రగామిగా నిలిచాం.

– ఆధ్యాత్మికం, పర్యాటకం.. ఇలా ఏ రంగంలోనైనా సీఎం కేసీఆర్ నాయకత్వంలో గుణాత్మక మార్పు సాధించాం.

– 21 రోజుల ఈ దశాబ్ది ఉత్సవాల పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ.. నాడు-నేడు సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించాలి.

– ప్రభుత్వం సాధించిన ప్రగతి తెలిస్తేనే., అనుకున్న కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. మీ అవగాహన కోసమే ఈ దశాబ్ది ఉత్సవాలు.

– ప్రభుత్వం పదేళ్లలో చేసిన పనిని, ఉద్దేశ్యాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి. మంత్రి హోదాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అవగాహన చేపట్టాం.

– ఈ దశాబ్ది ఉత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. నిర్లక్ష్యం ఉండొద్దు. స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులు గుర్తించి సహకారాన్ని అందించాలి.

– మండల స్థాయి అధికారుల సమన్వయంతో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమైతే ఈ కార్యక్రమం ప్రతీ గ్రామంలో విజయవంతం అవుతుంది.

– సమిష్టిగా అందరూ కలిసి ముందుకు సాగుదాం. నియోజకవర్గ స్థాయిలో బాగా చేద్దాం.

– గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పదవి కాలంలో విద్యుత్ సమస్యలపై ఖర్చులు చేశారు.. తప్ప ఏమీ లేదని గత అనుభవాలు వివరించారు.

– గతంలో బావులు అద్దెకు తీసుకుని ట్యాంక్ ద్వారా నీరు వ్యవసాయ బావులకు సరఫరా చేసేది. గతంలో తాగునీరు, సాగునీటి కోసం కష్టాలు ఉండేవి. మహారాష్ట్రలో ఇప్పటికీ తాగునీరు సరఫరా ఇబ్బందులు ఉన్నాయని, పక్కరాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలి.

– కలలో కూడా ఊహించని పనులు, కలలో కూడా రాని పనులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేశాం. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గురించి జరపాలి.

– మాతృశిశు మరణాలు తగ్గి దేశానికే ఆదర్శంగా నిలిచాం. ఇవాళ 14వ స్థానం నుంచి 3వ స్థానంలో తెలంగాణ వైద్యం చేరుకున్నది.

– ఓడీఎఫ్ ప్లస్. తెలంగాణ డబుల్ ప్లస్ తో వంద శాతంగా ముందున్నాం. డబుల్ ఇంజన్ సర్కారు ఉత్తర ప్రదేశ్, గుజరాత్ లు చిట్ట చివరి స్థానంలో ఉన్నాయి. వీటిపై చర్చ, మార్పులపై ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలి.

– అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమై ప్రజలను చైతన్యం చేయాలి. తెలంగాణ కంటే ముందు తర్వాత పరిస్థితి గురించి నాడు-నేడు మీద ప్రజలకు సవివరంగా వివరిద్దాం.

– నిజం ప్రచారం చేయక పోతే అబద్ధాలు రాజ్యమేలుతాయి. దీంతో ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారే చెప్పారు. ఇది చాలా విషం. మనం మన ప్రభుత్వం చేసిన పనులను చెప్పాలి.

– నారు పోసుడు మొదలు పెట్టండి. డైరెక్ట్ వెదజల్లె పద్ధతిలో సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖదే బాధ్యత కాదు. మన గ్రామ, మండల ప్రజాప్రతినిధుల పాత్ర చాలా కీలకం. దీంట్లో ప్రజాప్రతినిధులుగా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

– పంట కాలాన్ని ఒక నెల ముందుకు తీసుకు వద్దాం. రైతుల్లో ఒక మార్పు తెద్దాం. రేపట్నుంచి ప్రతీ రైతు వేదికల్లో ప్రధానంగా చర్చ జరగాలి. సిద్ధిపేట ఉద్యమంలో అభివృద్ధిలో ముందున్నాం. అదే తరహాలో మార్పులో కూడా ముందుందాం.

– కాళేశ్వరం నీళ్లు వస్తాయని, ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. జరిగిన సాగు ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరిద్దాం.

– దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరిపేలా అందరూ సమిష్టిగా పనిచేయాలి. జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. ఇంకా 1 లక్ష టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది.

– రైతుకు ఇబ్బందులు లేకుండా చేద్దాం. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.

– దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పనిచేయాలి.

– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ మీద చేసిన వ్యాఖ్యలు వీడియో క్లిప్పింగ్స్ ప్రదర్శిస్తూ.. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో జరిగిన ప్రగతి గురించి వివరిద్దాం. మనకు చీకటి కాదు.. ఆయనకు చీకటి అయ్యిందనే విషయాన్ని వివరిద్దాం.

– కొంత మంది విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని వారికి మనం బదులు చెప్పాలి. అబద్ధాలు చెప్పే వారికి మీరు విషయ పరిజ్ఞానం సంపాదించుకుని వారి అబద్ధాలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
– జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో 500 మందికి ఆటో నగర్ లో కేటాయించిన స్థలాలు మంజూరు చేసుకుందాం.