జనం సాక్షి దుబ్బాక
దళిత బంధు ఏమైంది..?
రైతు రుణమాఫీ ఎక్కడ..?
ఉద్యోగుల భర్తి ఎక్కడ..?
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏవి..?
ఇంటికో ఉద్యోగం ఎక్కడ..?
నిరుద్యోగ భృతి ఏమైంది..?
పోడు పట్టాల పంపిణీ ఏమైంది..?
కేజీ టు పీజీ ఏమైపోయింది..?
12% రిజర్వేషన్లు ఏమైంది..?
జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఎక్కడ..?
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 14 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఈరోజు 4.8 టాక్స్ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి 9 సంవత్సరాల నుండి ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప మీరు సాధించింది ఏమీ లేదు. ఏ ఒక్క రంగాన్ని కూడా మీరు అభివృద్ధి చేయలేరు మళ్లీ మీరు ప్రజలను మభ్యపెట్టడానికి వీధిలోకి వచ్చి ప్రజలను మోసం చేయడానికి నాటకాలు ఆడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రైతులకు విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయండి
ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్న మీరు రైతు రుణమాఫీని చేయండి.
విద్యార్థులకు మీరు ఏదైతే నిరుద్యోగ భృతి 3016 ఇస్తానన్నారు అవి తక్షణమే ఇవ్వండి.
మూడెకరాల భూమి ఇవ్వలేదు.
కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. గ్రామాలలో రైతులు విద్యార్థులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఏమి సాధించిందని మీరు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. కేవలం ప్రజాధనాన్ని వెచ్చించి మీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఎన్నికలు వస్తున్నాయని మాయమాటలు చెప్పి ప్రజలను మీరు మోసం చేస్తున్నారు ప్రజలు అందరూ చైతన్యవంతులుగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రైతులకు కానీ విద్యార్థులకు కానీ న్యాయం జరుగుతుందని తెలియజేశారు….
ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల ఇన్చార్జి కొంగరి రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల భరత్, సీనియర్ నాయకులు మట్ట కిషన్ రెడ్డి, ఉషయ్య గారి రాజిరెడ్డి, మంద శ్రీనివాస్, రగోత్తంపల్లి నరేందర్ రెడ్డి తోట్ల చంద్రం, శ్రీనివాస్ రెడ్డి డిపి రాములు ,ప్రవీణ్ రెడ్డి కృష్ణారెడ్డి సందీప్ నవీన్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు…




