టేకులపల్లి ,జూన్ 1 (జనం సాక్షి): తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రైతు దినోత్సవాన్ని రైతు వేదికలలో జూన్ 3న ఘనంగా జరుపుకుందామని, ఉదయం 9 గంటల నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయని అందుకు రైతులు ప్రజలు భారీగా తరలి రావాలని మండల వ్యవసాయ అధికారిని ఎన్ అన్నపూర్ణ కోరారు. రైతులు ఎడ్లబండ్లతో, ట్రాక్టర్లతో, డప్పు వైద్యాలతో కదలి రావాలని, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు లోని రైతు వేదికలో, చుక్కల బోడు, బోడు, సంపత్ నగర్, ప్రగళ్లపాడు వేదికలలో ఉత్సవాలు జరుగుతాయని, అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరుపుకొనుటకు మండల రైతాంగం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో, తహసిల్దార్, అధికారులకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎం ఏ ఓ మండలంలో ప్రతి ఒక్కరికి సమాచారం అందిస్తూ ఆహ్వానాలు అందజేస్తున్నారు. మండల అధికార యంత్రాంగం దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జూన్ 3న మండలంలోని ఐదు రైతు వేదికలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించనున్నందున బేతంపూడి పిఎసిఎస్ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు, సిబ్బంది ఉత్సవాలకు కదిలి రావాలని రైతులను కోరారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రైతు దినోత్సవం రైతు వేదికలలో ఘనంగా జరుపుకుందాం




