నెన్నెల, జూన్ 1, (జనంసాక్షి )
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను షెడ్యూల్ ప్రకారం ఘనంగా నిర్వహించాలని స్పెషల్ ఆఫీసర్ రాములు అన్నారు. గురువారం నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 2నుంచి 22 వరకు 21 రోజుల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఉత్సవాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈసమావేశంలో ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ ప్రకాష్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి. – స్పెషల్ ఆఫీసర్ రాములు.




