బెల్లంపల్లి, జూన్ 1, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ఎస్జికేఎస్ కార్యాలయంలో గురువారం విప్లవోద్యమం తొలితరం రథసారథి దేవులపల్లి వెంకటేశ్వరరావు 106 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర నేత అంబాల మహేందర్ మాట్లాడుతూ దేవులపల్లి వెంకటేశ్వరరావు చూపిన బాటలో మనం ప్రయాణించడమే ఆయనకు అర్పించే ఘన నివాళి అని అన్నారు. ఈసందర్భంగా ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎన్నం శంకర్, సింగరేణి కార్మికులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా దేవులపల్లి వెంకటేశ్వరరావు జయంతి వేడుకలు.




