అలంపూర్ మే30(జనంసాక్షి)ఏమి సాధించారని దశబ్ది ఉత్సవాలు చేస్తున్నారని అలంపూర్ మాజీ శాసన సభ్యులు సంపత్ కుమార్ అన్నారు.
శాంతినగర్ క్యాంపు కార్యాలయం లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడారు.ఏం సాధించారని జూన్ రెండవ తేదీ నుంచి 22 వరకు అని వారు చేస్తున్న హడావిడి అంతా ఇంతా లేదని, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ వల్ల జరిగిన అభివృద్ధి ఏమీ లేదని మళ్లీ పడ్డారు.శతాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే ఒకవైపు ఆశ్చర్యంగాను ఒక వైపు హాస్యాస్పదంగాను ఉందన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి రెండుసార్లు వారిని గద్దె లెక్కించిన ప్రజలంతా కూడా అసలేం అభివృద్ధి జరిగింది అధికార పార్టీ వల్ల అని విచిత్రంగా చూస్తున్నారు అన్నారు . జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలు అంతా కూడా రివ్యూ ఏర్పాటు చేసుకుని పత్రికల్లో దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి అని అంటున్నారు అన్నారు . ఈ దశాబ్ది కాలంలో అసలేం విజయాలు సాధించారని, విజయవంతం చేయాలని ప్రజల పక్షాన అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాను అన్నారు. పండుగ వాతావరణం లో దశాబ్ది ఉత్సవాలుఅంటున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా దుఃఖం, అసంతృప్తి కడుపు మంట ఉంటే మరి అటువంటి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి, వీరేమో పండుగ వాతావరణం నెలకొని ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎందుకు చేయాలి పండుగ ఎవరింట్లో పండుగ ఎవరికి న్యాయం జరిగిందని చేయాలి పండుగటిఆర్ఎస్ పార్టీలో ఉండి దోచుకు తినే వాళ్లకు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ పండగ అవసరం లేదు అన్నారు .మరో పేపర్ లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు అని ఉంది ఏం ఘనకార్యం సాధించారని దశాబ్ది ఉత్సవాలని కాంగ్రెస్పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక జడ్పీ చైర్పర్సన్ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. నలుగురు ఉన్నా కూడా నలుగురు ఏ ముఖం పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు.
ఒకసారి వీరు వారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలి అసలు ప్రజలు ఎందుకోసం ఓట్లు వేసి వారిని గెలిపించారు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మరి వీరు ఏం చేశారు అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన హామీలు చూస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఎన్నో పథకాల పేర్లు చెప్పి ఇదే విధంగా మోసం చేశారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఇటిక్యాల మండల అధ్యక్షుడు రుక్మంత రెడ్డి మహిళా అధ్యక్షురాలు నాగశిరమని మాజీ ఎంపిటిసి చిన్నిబాబు. జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి దేవేంద్ర తదితరులు ఉన్నారు.
దశాబ్ది ఉత్సవాలు జరిపే నైతిక అర్హత జిల్లా బిఆర్ఎస్ నాయకులకు లేదు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.




