హుజూర్ నగర్ మే 30 (జనంసాక్షి): రాష్ట్రంలో సిపిఐ పార్టీ సత్తా చాటేలా జూన్ 4 న భద్రాద్రి కొత్తగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయం ఆవరణ ఎదుట జూన్ 4న జరిగే బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసేందుకు సిపిఐ కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ ప్రభావం లేకుండా ఎన్నికలు రాజకీయాలు ఉండమన్నారు. మతతత్వ, కులతత్వ రాజకీయాలను ఎదిరించేందుకు బలమైన ప్రత్యామ్నాయం సిపిఐ అన్నారు. దేశంలో నియంతృత్వ పోకడలను, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను సిపిఐ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. జూన్ 4న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసి సిపిఐ నాయకులు, కార్యకర్తలు తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లవుల రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, యల్లావుల రమేష్, కొప్పోజు సూర్యనారాయణ, సోమగాని కృష్ణ, జడ వెంకన్న, మామిడి వెంకయ్య, పొనుగుపాటి వాసుదేవరావు, జక్కుల శ్రీనివాస్, చక్రాల స్టాలిన్ పాల్గొన్నారు.
సిపిఐ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి – సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్




