భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణంలో హైదరాబాద్ చౌరస్తా వద్ద గల వైయస్సార్ గార్డెన్స్ లో.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ..lసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు ఇంతగానో నీటి కష్టాలతో బాధపడ్డారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు గాని ప్రజలకు గాని నీటి కష్టాలు తీరాయని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సమస్య గాని నీటి సమస్య గాని ఏ విధంగా పరిష్కరించాలో ముందుగానే ఆలోచించి నా ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ గారిని తెలియజేశారు.దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతు కష్టాలను తీర్చిన రైతు బాంధవుడు కెసిఆర్ అని తెలియజేశారు…భువనగిరి పట్టణంలో రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మలు వేయడానికి చెరువులలో నీళ్లు లేవని జెసిపి తో తొవ్వించి వాటర్ ట్యాంకులతో నీళ్లు పోసి అందులో వేసామని, కానీ ఇప్పుడు బస్వాపూర్ ప్రాజెక్టు వల్ల బీబీనగర్ పెద్ద చెరువులో కానీ భువనగిరి పెద్ద చెరువులో గాని నీరు పుష్కలంగా ఉన్నాయని ఈ ఘనత కేసిఆర్ గారిదే తెలియజేశారు…ప్రజల నీటి కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి గడపగడపకు మంచినీరు అందించిన మహా వ్యక్తి కెసిఆర్ గారిని తెలియజేశారు.
రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు తమ పండించిన ధాన్యాన్ని అమ్మడానికి దళారులతో మోసపోయేవారని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతు వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులను రైతు ఖాతాలో జమ చేస్తుందని ఇలాంటి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేదని పేర్కొన్నారు.రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి నేటిపారుదల ఇరిగేషన్ శాఖ ఎస్సీ ఈ శ్రీనివాస్ ఈఈ కుర్షిత్, సీఈఓ కృష్ణారెడ్డి, ,మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, చైర్మన్ చింతల కిష్టయ్య గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి జెడ్పిటిసి బీరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాలు సాగునీటి దినోత్సవం




