భువనగిరి టౌన్ (జనం సాక్షి):–తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని పారిశ్రామిక వాడలో నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి దినోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులచే తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్ట పోయారని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక పరిశ్రమలలో ముందున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఎస్ విజయ్ కుమార్ రెడ్డి. టీఎస్ఐఐసీ యాదాద్రి జోన్ ఎలక్ట్రికల్ జేఈ ఆర్ మహేందర్, భువనగిరి జిల్లా ఐలా ప్రెసిడెంట్ రాజాచారి, కార్యదర్శి చింత రవి ఐల కమిటీ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో పారిశ్రామిక ప్రగతి దినోత్సవం




