ఎల్కాతుర్తి జూన్ 9 జనం సాక్షితెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరున అధికార ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దొరగారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా రాబోయే ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ ధనాన్ని తమ ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాలు గడుస్తున్న కూడా బడుగు బలహీన వర్గాలను పట్టించుకోకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే రాజకీయం చేస్తూ మళ్లీ అధికారం చేపట్టాలని దురుద్దేశంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిరోజు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ సొమ్మును తమ పార్టీ ఎదుగుదల కోసం వినియోగిస్తూ ప్రజలను మభ్య పెట్టడం సరైన పద్ధతి కాదని రెండవసారి అధికారంలోకి వచ్చినాక కనీసం గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా సర్పంచులను అప్పుల పాలు చేసి ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల పేరిట వేలాది రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని , రేపు రాబోయే రోజుల్లో అధికార పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు




