Thursday, 5 November 2026

మహాజన్ సంపర్క్ యోజన కార్యక్రమం లో పాల్గొన్న ముధోల్ భాజపా నాయకులు పవార్ రామారావు పాటిల్

భైంసా రూరల్ జూన్ 09 జనం సాక్షిప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడచినా 9 ఏళ్ళ బీజేపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అమలుపరుస్తున్న పధకాలు, విజయవంతమైన పాలనను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘మహా జన్ సంపర్క్ యోజన’ కార్యక్రమంలో భాగంగా ముధోల్ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం బైంసా రూరల్ మండలంలోని చుచుంద్ మరియు పాంగ్రి గ్రామాలలో ఇంటింటికీ పర్యటించటం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా మొదలు చుచుంద్ గ్రామంలో పురాతన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి చుచుంద్ మరియు పాంగ్రి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ గావించి గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ,రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మోస పూర్వక వైఖరిని మరియు ముధోల్ నియోజకవర్గం పట్ల స్థానిక శాసనసభ్యుడు విట్టల్ రెడ్డి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండ కట్టడం జరిగింది అంతేకాకుండా రాబోయే నాలుగు నుండి ఆరు మాసాల లోపు జరిగే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కారు తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో భైంసా రూరల్ మండల బీజేపీ శ్రేణులు , సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ,మాజీ ఎంపీటీసీలు నాయకులు ,కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేసారు.