Thursday, 5 November 2026

దాతల సహాయంతో

……..దాతల సహాయంతో……..
డిగ్రీ కళాశాలలో మద్యాహ్న భోజనం ప్రారంభం

బిచ్కుంద మార్చి 20 (జనంసాక్షి)
దాతల సహాయంతో మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో మద్యాహ్న భోజనం ప్రారంభించారు.1969 సంవత్సరంలో కళాశాల మంజూరు కావడానికి ముఖ్య కారకులు కీర్తిశేషులు నాల్చర్ శ్రీహరి, డాక్టర్ అలీ మరియు మల్లికార్జున్ అప్ప అని, విద్యార్థులు బాగా చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలని బిచ్కుంద పెద్దలు  మల్లికార్జున్ అప్ప, అసద్ అలీ, నాల్చర్ రాజు అన్నారు. మండలకేంద్రంలో గల డిగ్రీ కళాశాలలో కొందరు దాతలు మద్యాహ్న భోజనము ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రత్యేక చొరవతో అనేక సౌకర్యాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు అంకితభావం, పట్టుదలతో విద్యనభ్యశించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చునన్నారు. ప్రస్తుతం నెలకొన్న పోటీతత్వంలో ఏకాగ్రతతో విజయాన్ని సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ కళాశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు అశోక్ పటేల్, నాగ్నాథ్ పటేల్, డాక్టర్ రాజు, కోలావార్ కుమార్ సైట్, పురుషోత్తం మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రముఖర్జి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.