Tuesday, 3 November 2026

దిల్లీలో పీసీపీ అధ్యక్షుల సమావేశం

న్యూ దిల్లీ: దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షల సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు, పలువురు సీనియర్‌ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మిగిలిన రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై కూడా రాహుల్‌గాంధీ చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి సమావేశానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *