హైదరాబాద్ : పురానాపూల్ డివిజన్ లో రీపోలింగ్ ప్రారంభమయ్యింది. పురానాపూల్ 52వ డివిజన్ లోని 38 పోలింగ్ కేంద్రాల్లో కాసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 34,413 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన మూడుగంటల్లో ఫలితాలు వెలుడనున్నాయి. మరో పోలీసు అధికారులు పటిష్టమైనభద్రతా ఏర్పాట్లు చేశారు. వెబ్ కామ్ ద్వారా మినిట్ టూ మినిట్ అధికారులు పోలింగ్ సరళని పరీక్షించనున్నారు. పాతబస్తీలోని పురాణాపూల్‌లో రీపోలింగ్ కొనసాగుతోంది. 36 పోలింగ్ బూతుల్లో ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీపోలింగ్ సాయత్రం 5గంటలవరకూ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగంకోసం పురాణాపూల్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు పేయిడ్ హాలీడేగా హైదరాబాద్ కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రీపోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
పురానాపూల్ లో రీపోలింగ్ ప్రారంభం





