Wednesday, 4 November 2026

ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని యువతి ఆత్మహత్య

నార్సింగ్‌ : ప్రేమించానంటూ నమ్మించి ప్రియుడు ముఖం చాటేయటంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నగర శివారు బీరంచెరువు నివాసి శివయ్య కుమార్తె సంధ్య(20) హైదరాబాద్‌లో ఓ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతోంది. గత కొద్దికాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏమైందో తెలియదుగానీ ఆ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో వేదనకు గురైన సంధ్య సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి చేరిన ఆమెను 108 వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *