హైదరాబాద్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 503 పరుగులకు ఆలౌటైంది. సోమవారం డ్రింక్స్ విరామానికి ముందు 456/4 పరుగులతో పటిష్ఠంగా ఉన్న టీం ఇండియా సుమారు 40 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ 34, ధోని 44, జడేజా 10 అశ్విస్ 1, హర్భజన్ 0, భువనేశ్వర్ కుమార్ 10 పరుగులు చేయగా, ఇషాంత్ శర్మ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్ వెల్స్ నాలుగు వికెట్లు తీయగా, ధోర్తీకి మూడు, పాటిసన్ రెండు, సిడిల్‌కు ఓ వికెట్ దక్కింది. 503 పరుగులకు ఆలౌటైన భారత్‌కు ఆస్ట్రేలియాపై 266 పరుగుల ఆధిక్యం లభించింది.




