Tuesday, 3 November 2026

దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా మహిళా, శిశుసంక్షేమ అధికారి పద్మావతి

సంగారెడ్డి, మే 30, జనంసాక్షి : జిల్లాలోని దివ్యాంగులకు హోప్ న్యూరో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్, సహారా హెల్త్ & డెవలప్మెంట్ సొసైటీ, సెంటర్ ఫర్ సస్టైనేబుల్ డెవలప్ మెంట్, సంగారెడ్డి వారి సౌజన్యంతో అటిజం, సెరిబ్రల్ పల్సి, అభివృద్ధి ఆలస్యం గల పిల్లలకు ఉచిత పిజియో తెరఫీ, స్పీచ్ తెరఫీ బిహేవియర్ తెరఫీ, ఆక్యుపేషనల్ తెరఫీ, ఇంక్లుసివ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లుగా జిల్లా మహిళా శిశుసంక్షేమ అధికారి పద్మావతి తెలిపారు. శారీరక వైకల్యం ఉన్నవారికి చంక కర్రలు, చేతి కర్రలు, వాకర్స్ ఉచితంగా పంపిణి చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. చంక కర్రలు, చేతి కర్రలు, వాకర్స్ పొందుటకు వైద్య ద్రువీకరణ పత్రము, ఆదార్ కార్డ్, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు (2) సెంటర్ ఫర్ సస్టైనేబుల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ దిడిగే కార్తీక్ కు ఇవ్వాలని చెప్పారు. మరిన్ని వివరాలకు కార్తీక్ 9700005848 కు సంప్రదించలన్నారు.