నల్గొండటౌన్, జనంసాక్షి:(మే 30)సోమవారం నాడు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 15 మందిలో ముగ్గురు వ్యక్తులకు జైలు. ముగ్గురు వ్యక్తులలో ఒకరికి ఒకరోజు జైలు , జరిమానా మరియు మిగిలిన ఇద్దరు వ్యక్తులకు రెండు రోజుల జైలు,జరిమానా మరియు మిగిలిన 12 మంది వ్యక్తులకు జరిమానా విధించారని వివరించారు. మొత్తం 15 మందికి గాను 19,500/- రూపాయల జరిమాన విధించారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐతో పాటు, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.




