Monday, 2 November 2026

బడ్జెట్‌పై సిఎం కెసిఆర్‌ కసరత్తు

హైదరాబాద్‌,ఫిబ్రవరి28 జ‌నంసాక్షి :  మాదాపూర్‌ నాస్‌డాక్‌లో ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ సమావేశమై బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించారు. ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలనే అంశంపై మంత్రి చర్చించారు. మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌ను గవర్నర్‌ నరసింహన్‌ జారీ చేశారు. దీంతో కేంద్రబడ్జెట్‌ను కూడా సిఎం చర్చిస్తున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *